తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని మలేసియా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. మలేసియా పర్యటనలో భాగంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మేము తీసుకువచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడ లేనంత అనుకూల వాతావరణం తెలంగాణలో ఏర్పడిరది. మలేసియా`భారత్‌లో మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని మేము కోరుకుంటున్నాం. పెట్టుబడులతో వచ్చే వారందరికీ హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోంది. డిసెంబరులోగా తెలంగాణ సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నాం అని మలేసియా పారిశ్రామికవ్తేలకు మంత్రి తెలిపారు.