Semiconductor :సెమీ కండక్టర్ అసోసియేషన్‌తో సమావేశమైన మంత్రి శ్రీధర్‌బాబు

సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu )సెమీకండక్టర్ అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. ఆ పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్(Brian Tan), వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్ (Tan You Kang) పాల్గొన్నారు. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ(Semiconductor industry) ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులను శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రం కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని శ్రీధర్‌బాబు తెలిపారు. ఎస్‌ఎస్‌ఐఏ (SSIA) ప్రతినిధులను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివర్లో హైదరాబాద్ వస్తామని తెలిపారు.