Skill University : సింగపూర్.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం

సింగపూర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) పర్యటించారు. ఈ పర్యటనలో అక్కడి ఐటీఈతో (ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu ) సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఐటీఈ (ITE) పాఠ్యాంశాలను స్కిల్ వర్సిటీ ఉపయోగించుకోనుంది. ఈ మేరకు స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ మధ్య ఒప్పందం కుదిరింది.
అంతకుముందు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్యం నిర్మాణంపై వారు చర్చించారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ భేటీలో పాల్గొన్నారు.