CM Revanth :దేశాభివృద్ధిలో ప్రవాసుల పాత్ర కీలకం : సీఎం రేవంత్

ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంటోన్న భారతీయులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) శుభాకాంక్షులు తెలిపారు. దేశాభివృద్ధిలో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ పోషిస్తున్న పాత్ర ఎంతో ముఖ్యమైనదని, తెలంగాణ రైజింగ్ కార్యాచరణ లోనూ ఎన్నారై (NRIs )ల భాగస్వామ్యం ఆవశ్యకమని సీఎం రేవంత్ ఒక సందేశంలో పేర్కొన్నారు. గాంధీజీ (Gandhiji) దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా గొప్ప పేరు పొందిన తర్వాత స్వజనుల సేవ కోసం, స్వరాజ్య సాధనలో భాగంగా కావడానికి 1915, జవనరి 9న ముంబైకి తిరిగొచ్చిన సందర్భానికి గుర్తుగా ప్రవాస దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.