Revanth Reddy : విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం : రేవంత్ రెడ్డి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను సంబంధించి పోస్టర్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) విడుదల చేశారు. ఢిల్లీ లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ (Gas cylinder) ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడిరచారు. తెలంగాణలో మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాం. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు కల్పించాం. తెలంగాణలో ఆర్టీసీ(RTC bus) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని అని కోరారు.