Harish Rao : భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధం

రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకొనే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ మాట తప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy )క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులదరూ కలసి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచి రావాల్సిన పథకాలు సాధిద్దామని అన్నారు. ఎకరంలోపు భూమి ఉంటే వారిని కూలీలుగా గుర్తించి 12 వేలు ఇవ్వాలన్నారు. భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గోబెల్స్‌ను మించిపోతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ (BRS)హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని దుష్ప్రచారం చేస్తున్నారు చెప్పారు.