America: అమెరికాకు ఎమ్మెల్సీ కవిత

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా బయల్దేరి వెళ్లారు. కుమారుడు ఆదిత్య (Aditya) గ్రాడ్యుయేషన్ కార్యాక్రమంలో పాల్గొనేందుకు భర్త అనిల్ (Anil) తో కలిసి కవిత అమెరికా (America) వెళ్లినట్లు ఎమ్మెల్సీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22 వరకు కవిత అక్కడే ఉంటారని, 23న తిరిగి హైదరాబాద్ (Hyderabad) చేరుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఆమె పర్యటనకు ఢల్లీిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court ) అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది.