అమెరికా నుంచి డీజీపీకి.. కేటీఆర్

తమ పార్టీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వరుస దాడులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. ఖమ్మంలో మాజీ మంత్రులు హారీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌పై కాంగ్రెస్ నాయకుల దాడిని ప్రస్తావించారు. రైతు రుణమాఫీపై శాంతియుతంగా ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలపై దాడిని గుర్తు చేశారు. తాజాగా కౌశిక్‌రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన దాడి ఘటనలపై పోలీసుల నిష్క్రియాపరత్వాన్ని ఆయన డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై డీజీపీ సానుకూలంగా స్పందించి విచారణ చేపడతామని పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు.