Minister Ponna prabhakar :ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది : మంత్రి పొన్నం

బీఆర్‌ఎస్ పాలనలో బీసీలకు ఏమాత్రం గౌరవం దక్కలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponna prabhakar) విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడుతూ బీఆర్‌ఎస్ (BRS) నేతలపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ (BC)లను పట్టించుకోని బీఆర్‌ఎస్, ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలోనే బీఆర్‌ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో బీసీలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
Tags