Lottery process: తెలంగాణలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రారంభం
తెలంగాణలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ (Lottery process) ప్రారంభమైంది. ఆయా జిల్లాల కలెక్టర్ల (Collectors) సమక్షంలో డ్రా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులకు డ్రా ( లాటరీ) పద్ధతిలో లైసెన్స్‌ల ఎంపిక జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో ప్రక్రియ కొనసాగింది. మొత్తం దరఖాస్తుల్లో మూడొంతులకు పైగా రాజధానితోపాటు దాని పరిసరాల్లోనే నమోదుకావడం గమనార్హం. హైదరాబాద్ (Hyderabad) , సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, శంషాబాద్ (Shamshabad) ఎక్సైజ్ జిల్లాల్లోని 615 దుకాణాలను 33,835 (33.56శాతం) దరఖాస్తులు వచ్చాయి.







