KTR : నేను తప్పు చేయలేదు.. ఎవరికీ భయపడను : కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ డైరీని ఆ పార్టీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTA) ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. 2001లో కేసీఆర్ (KCR) పార్టీ పెట్టిన నాడు ఉన్న ఇబ్బందులతో పోల్చితే ఇప్పుడు ఉన్నవి పెద్దవి కాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బిడ్డగా, ఆయన తయారు చేసిన సైనికుడిగా నేను ఎంతో దైర్యంగా ఉంటా. తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నట్లు ఢల్లీి కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. కేసులు అసలు సమస్యే కాదు. రైతు భరోసా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరంగా చెప్పాలి. ఈ కేసుపై నేను పోరాడతాను. బీఆర్‌ఎస్ నేతలు కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేయలేదు. ఎవరికీ భయపడను అని అన్నారు.