KTR :దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది : కేటీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండిరచారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ (Congress Party )కి అలవాటుగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి (Kancharla Ramakrishna Reddy), మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (Paylla Shekhar Reddy) అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని ఆక్షేపించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ (BJP) కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, అరాచకాలకు చిరునామాగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలతో పాటు వారి వెనకున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.