రోడ్డుపై చిన్నారులతో షటిల్ ఆడి సందడి చేసిన కేటీఆర్..

మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్నంలో శుక్రవారం నాడు పర్యటించారు. ఈ నేపథ్యంలో సడన్ గా కేటీఆర్ చిన్నారులతో కలిసి కాసేపు షటిల్ ఆడి సందడి చేశారు. పర్యటనలో భాగంగా రోడ్డుపై షటిల్ ఆడుతున్న చిన్నారులను చూసిన కేటీఆర్ వాళ్లను పలకరించారు. కేటీఆర్ ను తమతో షటిల్ ఆడవలసిందిగా ఆ చిన్నారులు సరదాగా కోరగా.. ఆ కోరికను మన్నించి వారితో కాసేపు షటిల్ ఆడారు. స్థానికులు కూడా కేటీఆర్ తో కలిసి ఫోటోలు దిగారు. పిల్లలతో కలిసి కేటీఆర్ షటిల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.