Formula E Race : 7 గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు

ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ (HMDA) ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ (ED) అధికారులు ఆరా తీసినట్టు సమచారం. విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అర్వింద్ కుమార్ (Arvind Kumar), బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ రేస్ (Formula E Race) లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.