Kadiyam Srihari: నేను రాజీనామా చేయట్లేదు : కడియం శ్రీహరి
బిఫాంలు, పదువులు అమ్ముకునే అలవాటు తనకు లేదని, తాను ఎంఎల్ఎ పదవికి రాజీనామా (Resignation) చేయడం లేదని, తన ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలోని ఈఆర్ఎల్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యకర్తలు తల దించికునే పని ఎప్పటికీ చేయనని గల్లా ఎగేరుకునేలానే పనిచేస్తానని అన్నారు. స్పీ కర్ నిర్ణయం ఎలా ఉన్నాఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నానని, తనకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ని యోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.






