Justice Sujoy Paul: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా సుజయ్ పాల్ నియామకం

తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujoy Paul) నియమితులయ్యారు. మంగళవారం నాడు ఆయన తెలంగాణ సీజేగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలంగాణ హైకోర్టులో జడ్జిగా పని చేసిన జస్టిస్ సుజయ్ పాల్.. ఇప్పుడు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాథే బదిలీ అయ్యారు. ఆయన్ను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే జస్టిస్ సుజయ్ పాల్‌కు (Justice Sujoy Paul) తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా పదోన్నతి లభించింది. జస్టిస్ సుజయ్ పాల్.. గతేడాదే తెలంగాణ హైకోర్టులో జడ్జిగా చేరారు.