Harish Rao: జిల్లా కేంద్రాల్లోనూ బాకీకార్డు సభలు : హరీశ్‌రావు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం మాటలన్నీ బోగస్నేనని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కళ్లు తెరవాలంటే జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిరచాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జలవిహార్‌లో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీకార్డు ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవేమీ పోదని, తప్పులు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ (Job notification) ఇవ్వమంటే మద్యం దుకాణాలకు ఇచ్చారు. రేవంత్ రెడ్డి అన్ని శాఖల్లోనూ ఫెయిలై వసూళ్లలో మాత్రం పాసయ్యారు. తుపాకులు, ఎక్కవపెట్టి వాటాల కోసం పోటీ పడుతున్నారు. బాకీకార్డు ఆవిష్కరణ సభలు జిల్ల కేంద్రాల్లోనూ పెడతాం అని తెలిపారు.







