Nagoba Jatara :నాగోబా జాతరకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో సమ్మక్క, సారక్క (Sammakka, Sarakka )జాతర తర్వాత అతిపెద్ద ఆదివాసుల పండుగగా గుర్తించిన కెస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara )ఉత్సవాలు ఈనెల 28 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం అధికారిక పండగ ఉత్సవాలుగా నిర్వహించే నాగోబా జాతర ఏర్పాట్లకు సంబంధించిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah), జిల్లా ఎస్పీ గౌస్ ఆలం(SP Gaus Alam), ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా, ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్, సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మట్ సమీక్షించారు. కెస్లాపూర్ నాగోబా ఆలయంలో ఆదివాసీ సాంపద్రాయ ఆచారం మేరకు తలపాగ చుట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.