NVIDIA : హైదరాబాద్ కుర్రాడికి రూ.3 కోట్ల వార్షిక వేతనం

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ చిత్ర లేఅవుట్‌కు చెందిన జి.సాయిదివేశ్ చౌదరి (Saidivesh Chowdhury) అమెరికాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA)లో రూ.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఇతను కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తున్నట్టు ఆయన తండ్రి కృష్ణమోహన్ (Krishnamohan) వెల్లడిరచారు. సాయిదివేశ్ తండ్రి కృష్ణ మోహన్ స్థిరాస్తి వ్యాపారం చేస్తుండగా, తల్లి శైలజ (Shylaja) రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పదేళ్ల పాటు పనిచేశారు. వీరికి ఇద్దరు కుమారులు, వారిలో పెద్ద కుమారుడు సాయిదివేశ్ విద్యాభ్యాసం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో కొనసాగింది. ఎన్‌ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ చదివాడు. అక్కడే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అనంతరం లాస్‌ఏంజెలెస్ (Los Angeles) లోని యానివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేసిన సాయిదివేశ్ ఎన్విడియా కంపెనీలో డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.