Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో మజ్లిస్, బీజేపీ మధ్యే పోటీ : రామచందర్ రావు
జూబ్లీహిల్స్‌లో మజ్లిస్ (Majlis) కు బీజేపీకి మధ్యే పోటీ బీజేపీ అని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.స్టేట్ ఆఫీస్‌లో రామచందర్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) , బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని పేర్కొన్నారు. మజ్లిస్‌ను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. ప్రజల్లో బీజేపీని గెలిపించాలనే ఆలోచన ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2028 జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసింది ఏమీ లేదని ఆరోపించారు.







