BJP: డీజీపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళన

హైదరాబాద్ నగర శివారు పోచారం ఐటీ కారిడార్‌లో గోసంరక్షకుడు సోనూసింగ్‌పై కాల్పుల ఘటన నేపథ్యం లో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం ముట్టిడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం వద్దకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao) తో పాటు పలువురు నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ (BJP) నేతల ఆందోళనతో లక్డీకాపూల్ (Lakdikapoo), అసెంబ్లీ (Assembly) ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాబ్ ఏర్పడిరది. వాహనాల రాకపోకలను పోలీసులు క్రమబద్దీకరించారు.