Harish Rao: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల నిలిపివేతపై హరీశ్ రావు రియాక్షన్!

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) తాజాగా స్పందించారు. రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరాను నిలిపివేయాలని యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందని హరాశ్ రావు అన్నారు. బీర్లకు సరఫరాకు సంబంధించిన బకాయిలను బేవరేజెస్ కార్పోరేషన్ తమకు చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ చెప్తోందన్న హరీశ్ రావు (Harish Rao).. ఈ కారణంగా రాష్ట్రంలో కింగ్ ఫిషర్ వంటి ప్రీమియం బ్రాండ్ల బీర్లు దొరకడం కష్టంగా మారే అవకావం ఉందన్నారు. ఇలా చేసి పెద్ద బ్రాండ్లను నిలిపివేసి, ఆ తర్వాత బూమ్ బూమ్, బిర్యానీ వంటి లోకల్ బ్రాండ్ బీర్లను ప్రమోట్ చెయ్యడం కోసం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బకాయిలు నిలిపివేసి ఉండొచ్చని హరీశ్ రావు (Harish Rao) అనుమానం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లించే విషయంలో ప్రత్యేక ప్రాధాన్యతల ఉండటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందా? అని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా బిల్లులను క్లియర్ చేసేదని, అప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని ఆయన (Harish Rao) గుర్తుచేశారు.