వాటితోనే మళ్లీ అధికారంలోకి వస్తాం : హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగినప్పుడు డీజీపీ ఎందుకు స్పందించలేదన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై దాడులు జరిగితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. గురవారం జరిగిన ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డే కారణమని అన్నారు. అరెకపూడి గాంధీని గురువారమే హౌస్ అరెస్ట్ చేసి ఉంటే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగేది కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో అరాచక పాలన గురించి రాహుల్‌గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును పక్కదారి పట్టించడానికే కౌశిక్‌రెడ్డిపై దాడికి దిగారని ఆరోపించారు. మాపై ఎన్ని రాళ్లు వేస్తారో వేయండి. వాటితోనే మళ్లీ అధికారంలోకి వస్తాం అని అన్నారు.