KCR: కేసీఆర్, హరీష్ రావుకు మూడినట్టేనా…?

తెలంగాణలో కాలేశ్వరం కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను విచారించిన కాలేశ్వరం కమిషన్… ఇక నుంచి రాజకీయ నాయకులపై ఫోకస్ పెట్టనుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకులపై పెద్దగా ఫోకస్ చేయని కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ గోష్ క్రమంగా రాజకీయ నాయకుల పై ప్రజాప్రతినిధులపై దృష్టి సారిస్తున్నారు. ఈనెల 19 కి హైదరాబాద్ వస్తున్న కాలేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర గోష్ రెండు నుంచి మూడు వారాలపాటు హైదరాబాదులోనే ఉండనున్నారు.
ఈసారి ప్రజాప్రతినిధులను బహిరంగ విచారణ చేయనున్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి సోమేశ్ కుమార్, రజిత్ కుమార్, వికాస్ రాజులను కమిషన్ విచారించారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వ స్థాయి నిర్ణయాలు అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల నుంచి కీలక సమాచారాన్ని కమిషన్ రాబట్టింది. దాని ఆధారంగా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి హరీష్ రావు (Harish rao), ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేంద్రతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి(KCR)ని కూడా విచారణ పిలిచే అవకాశం ఉంది.
పక్కా సమాచారంతోనే ప్రజాప్రతినిధులను విచారణకు పిలవడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే సగానికి పైగా కాలేశ్వరం ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్ ను జస్టిస్ గోష్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. ముఖ్యంగా డిజైన్ల మార్పు విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అధికారులు ఇప్పటికే తమ వాంగ్మూలం వినిపించారు. వాటిని ఆడియో వీడియో రికార్డులు చేసుకున్న అధికారులు వాటి ఆధారంగానే విచారణ చేయనున్నారు. ఇప్పటికే కేటీఆర్ విచారణతో ఇబ్బందులు పడుతున్న భారత రాష్ట్ర సమితికి ఈ పరిణామం మరిన్ని ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉండవచ్చు.