అన్నీ చేసే ఇక్కడి వరకు వచ్చాం.. ఆయన కెపాసిటీ ఎంతో మాకు తెలుసు

ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా? ఆయన వ్యక్తిగతమా? అనే దానిపై బీఆర్‌ఎస్ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాలని ఎమ్యెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ నివాసం వద్ద దానం మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టొదన్నారు. గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం పేరిట ఆయన్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసని ఎద్దేవా చేశారు. తాము అన్నీ చేసే ఇక్కడికి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది పార్టీ నిర్ణయమా? కౌశిక్‌రెడ్డి వ్యక్తిగతమా? ఆయన వ్యక్తిగతంగా చేసినట్లు భావిస్తే బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయండి. విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ కార్యాలయంలో చేస్తారా? ఇంటో చేస్తారా? అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? అని దానం మండిపడ్డారు.