CM Revanth Reddy :భూ భారతితో మెరుగైన సేవలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం భూభారతి(Bhubharthi ) లో రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ తెలంగాణ తహసీల్దార్ల సంఘం(Tahsildars Association) , తెలంగాణ రెవెన్యూ సైర్వీసెస్ అసోసియేషన్ల (Revenue Services Association ) కు చెందిన డైరీలను ఆవిష్కరించి మాట్లాడారు. గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ధరణితో భూసమస్యలు పెరిగాయని, రైతులకు, ప్రజలకు రెవెన్యూ సేవలను వేగంగా, సులభంగా అందించేందుకు భూ భారతిని తీసుకొస్తున్నామని వివరించారు. తెలంగాణ ఉద్యోగుల ఐకాస, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు రాములు, రాంరెడ్డి, భిక్షం, సుజాత పాల్గొన్నారు.