CM Revanth Reddy: సీఎం రేవంత్ ఆస్ట్రేలియా పర్యటన రద్దు.. ఆ టైంలో ఢిల్లీకి!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. ఈ క్రమంలోనే ఆయన ఈ నెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారట. మూడ్రోజులపాటు ఢిల్లీలో సీఎం రేేవంత్ పర్యటిస్తారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో దేశ రాజధానిలో సీఎం పర్యటిస్తారని, అలాగే 15వ తేదీన ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూడ్రోజుల పర్యటన అనంతరం, ఈ నెల 17వ తేదీన సీఎం రేవంత్.. ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్తారు. రెండ్రోజులపాటు సింగపూర్‌లో పర్యటించిన అనంతరం, అక్కడి నుంచి దావోస్ వెళ్లనున్నారు. 23వ తేదీ వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో సీఎం రేవంత్ (CM Revanth Reddy) పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.