సీతక్క తల్లిని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్ నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్కను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సమ్మక్క ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సీతక్కకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అంతేగాక సీతక్క చేపట్టిన కార్యక్రమాలను, ఆమె క్రమశిక్షణను డాక్టర్లకు చెబుతూ ఆమె కృషిని అభినందించారు. ఈ సందర్భంగా సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి సమ్మక్క యోగక్షేమాలు తెలుసుకొని చంద్రబాబు ధైర్యం చెప్పారని ఎమ్మెల్యే సీతక్క ట్విటర్ ద్వారా తెలియజేశారు. తన తల్లిని పరామర్శించిన తన ఆత్మీయ సోదరుడు చంద్రబాబుకు సీతక్క ధన్యవాదాలు తెలిపారు.