Dallas: డల్లాస్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను జూన్ ఒకటో తేదీన అమెరికా (America)లో నిర్వహిస్తున్నట్లు పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రకటించింది. డల్లాస్ (Dallas)లో జరిగే ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్య అతిథిగా హాజరవుతారు. డల్లాస్‌లోని డీఆర్ అప్పర్ అరేనా (DR Upper Arena) లో ఈ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం అంతర్జాతీయ సమన్వయకర్త మహేశ్ బిగాల (Mahesh Bigala), బీఆర్‌ఎస్ యూఎస్‌ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ (Thaneer Mahesh) సంయుక్త ప్రకటన చేశారు. డల్లాస్ సభకు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కూడా హాజరకున్నారు. ఎల్కతుర్తి (Elkaturthi) లో జరిగిన రజతోత్సవ సభ (Silver Jubilee Celebration) కు దీటుగా అమెరికాలో సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఏడాది పాటు వివిధ దేశాల్లో రజతోత్సవ వేడుకలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం సన్నాహాలు చేస్తోంది. ఎల్కతుర్తి రజత్సోతవ సభలో తెలంగాణ ప్రజల మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారని స్పష్టమైందని మహేశ్ బిగాల ప్రకటించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు హాజరయ్యే సభలో తెలంగాణ కళాకారుల బృందం ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.