BRS :పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేతలు

ఫార్ములా- ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR)ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగింది. ఉదయం 10:40 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కేటీఆర్‌ను విచారించారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath), బాల్క సుమన్(Balka Suman), ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ ఆఫీసు వైపు వచ్చే వాహనాలను పోలీసులు (Police) దారి మళ్లించారు. కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు సూచించారు.