తెలంగాణలో బ్రిస్టోల్ ఫార్మా భారీ పెట్టుబడులు
అమెరికా కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ బ్రిస్టోల్ మైర్స్ స్క్విబ్ (బీఎంఎస్) హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. తీవ్రమైన వ్యాధులకు సంబంధించి ఔషధాల తయారీలో ఈ సంస్థ అంతరాజతీయ ఖ్యాతి గడించింది. నూతన ఔషధాల పరిశోధన, అభివృద్ధి కోసం ఈ సంస్థ 2021లో 9 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఫార్మా విస్తరణ ప్రణాళికలలో భాగంగా భారత్‌లోనూ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఎంఎస్ భావిస్తోంది. లైఫ్ సైన్సెస్ రంగంలో పేరుగాంచిన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పరస్సర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, బీఎంఎస్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారు.






