Bandi Sanjay:వారు సాయుధ వర్గాలతో సంబంధాలు తెంచుకోవాలి : బండి సంజయ్

రాజకీయ రంగస్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ కొందరు రాజకీయ నేతలు మావోయిస్టుల (Maoists) తో సంబంధాలు కలిగి ఉన్నారని, వారు సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. తెలంగాణకు చెందిన పలువురు నేతలు మావోయిసట్లుతో సంప్రదింపులు చేస్తున్నారన్న నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) , ఆధ్వర్యంలో అమిత్ షా (Amit Shah) మార్గదర్వకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టుల నిర్మూలనకే పరిమితం కాలేదు. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్‌లను సైతం వెలికి తీస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు అని పేర్కొన్నారు.