అవెవా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం

టెక్నాలజీ సేవల సంస్థ అవెవా హైదరాబాద్‌లో తాజాగా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటన్‌ను ప్రారంభించింది. భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో ఇక్కడ సెంటర్‌ను నెలకొల్పింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు సెంటర్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ సెంటర్‌లో 1,200 మందికి పైగా టెక్నాలజీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవెవా చీఫ్ కమర్షియల్ అధికారి స్యూ క్వెన్స్ మాట్లాడుతూ అంతర్జాతీయ వ్యాపారంలో భారత్ చాలా కీలకంగా మారిందని, దీంతో ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను నెలకొల్పాలని గతంలోనే నిర్ణయించినట్లు, దీనికి అనుగుణంగా ఇక్కడ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.