నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే , బీఆర్‌ఎస్ నేత ఆరూరి రమేశ్ తెలిపారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవలేదని స్పష్టం చేశారు. ఆరూరి రమేశ్ పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను కేసీఆర్ పిలిపించారు. దీంతో ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, బసవరాజు సారయ్య, రమేశ్ ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు.