400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దాం : అమిత్ షా

తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామా. 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామా అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నామస్మరణే. మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పనిచేస్తాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లిస్ భయపడుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్, మూడు వారసత్వ పార్టీలే. అవి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి. ఓబీసీల గురించి ఆ మూడు పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా? కేవలం వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయం అన్నారు.
తెలగాణ ప్రజలు బీజేపీకి 12 ఎంపీ సీట్లు తగ్గకుండా ఇవ్వాలి. మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.6 వేల చోప్పున వేస్తూ, అండగా ఉంటోంది. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తాం. ఇప్పటికే 14 కోట్ల ఇళ్లకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇచ్చాం. పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు 1.17 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. మోదీ పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు వచ్చాయి. బీజేపీ ఎపుడే ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు అని అన్నారు.