Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో హైడ్రా కమిషనర్ భేటీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను తెలంగాణకు చెందిన హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) ఎ.వి.రంగనాథ్ (A.V.Ranganath) మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి (Mangalagiri) లోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రంగనాథ్, పవన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా వీరిద్దరూ వివిధ అంశాలపై ఏకాంతంగా చర్చించనట్లు సమాచారం. మర్యాద పూర్వకంగా భేటీ జరిగినట్లు పవన్ కల్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.







