Prudhvi Raj : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటుడు పృథ్వీరాజ్

రెండ్రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ (Social Media Wing )తనను వేధిస్తోందని నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌కాల్స్, మెస్సేజ్‌ల (messages) తో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లైలా ప్రీరిలీజ్ ఈవెంట్ (Laila Prerelease Event)లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆ సినిమా వేడుకలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని పృథ్వీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ వైసీపీ వింగ్ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది.