ACB Court :సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు (ACB Court ) అనుమతి ఇచ్చింది. జవనరి 13 నుంచి 23 వరకు విదేవీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టు (Passport)ను కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇందుకోసం ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం జులై (July ) 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.