Jubilee Hills: జూబ్లీహిల్స్ బరిలో 58 మంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తం 81 మంది నామినేషన్లు (Nominations) చెల్లుబాటు కాగా, వారిలో 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బరిలో ఉన్న వారు, నోటా (Note) తో కలిపితే మొత్తం సంఖ్య 59కి చేరనున క్రమంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) తెలిపారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్‌పై 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఒకే కంట్రోల్ యూనిట్‌తో నాలుగు బ్యాలెట్ యూనిట్లు పని చేసే వెసులుబాటు ఉందని, ఓటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లు, ఒక్కో కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్(VVPAT) యంత్రం వినియోగించనున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం, నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సిన దృష్ట్యా, ఓటింగ్ కంపార్ట్‌మెంట్ కొంత ఎక్కువ పరిమాణంలో ఉండనుంది.







