Americ :అమెరికాలో విద్యావకాశాలపై 21న వర్క్ షాప్

అమెరికాలో విద్యావకాశాలకు సంబంధించి ఈనెల 21న హైదరాబాద్‌లో వర్క్‌షాప్ (Workshop) నిర్వహిస్తున్నట్లు క్యానమ్ కన్సల్టెంట్స్ సంస్థ ప్రకటించింది. హోటల్ తాజ్ డెక్కన్ (Taj Deccan) లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వర్క్‌షాప్ ఉంటుందని పేర్కొంది. అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రతినిధులను భారతీయ విద్యార్థులు నేరుగా కలిసి ప్రవేశాలు, ఉపకార వేతనాలు, వీసా(VISA), భవిష్యత్తు అవకాశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. 2025లో అమెరికా బ్యాచిలర్, మాస్టర్, డిప్లొమా, ఎంబీఏ(MBA) తదితర కోర్సులకు సంబంధించి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.