Indrasena Reddy: ద్వితీయ భాషగా తెలుగు తప్పనిసరి చేయాలి : ఇంద్రసేనారెడ్డి
తెలుగు పరిరక్షణకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి (N. Indrasena Reddy) సూచించారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగుభాషను కాపాడుకోవాలంటే ఇంట్లో తెలుగే (Telugu) మాట్లాడాలి. అమెరికా (America) వెళ్లినవారు తెలుగులోనే మాట్లాడుకోవాలి. రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి విడిపోయిన ప్రాంతాలు పలు రాష్ట్రాలోకి వెళ్లినపుడు అక్కడ తెలుగు మాధ్యమంలో పాఠశాలలున్నా, కొంతకాలానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా మాతృభాషలనే చదవాలనడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా తెలుగుకు ప్రత్యామ్నాయంగా ఆప్షన్ ఇవ్వడంతో ఇతర భాషలు ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. లిపి లేని భాషలనూ గౌరవించాలన్నారు.






