Vijay Sai Reddy: జగన్ కోసం భారీ స్కెచ్ రెడీ చేస్తున్న విజయసాయిరెడ్డి..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడ్డ నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి ( Vijay Sai Reddy) ఇటీవల తన మౌనంతో రాజకీయాల్లో చర్చకు కేంద్రంగా మారారు. పార్టీకి చాలాకాలం సేవలు అందించిన ఆయనపై ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వర్గం గట్టిగా విమర్శలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాజ్యసభ సీటును ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu) అమ్మేశారని ఆరోపణలు రావడం, వైసీపీ శిబిరంలో సంచలనంగా మారింది.
ఇక ఇదిలా ఉండగా, జగన్ సోదరి వైయస్ షర్మిల (YS Sharmila) కూడా తన అన్నపై విమర్శల దాడులు కొనసాగిస్తుండటం, ఈ రాజకీయ నాటకాన్ని మరింత రసవత్తరంగా మార్చింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, జగన్ పట్ల ప్రజల్లో కొంత సానుభూతి కలుగుతోందన్న సంకేతాలు వచ్చాయి. వెంటనే షర్మిల తుఫానులా బహిరంగంగా విమర్శలు చేస్తూ, గతంలో జగన్ ఎలా పోలీసులపై మండిపడ్డారో గుర్తు చేస్తూ ఆయనపై దాడికి దిగారు.
ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే, జగన్ గట్టిగా ఆయనను విమర్శించినప్పటికీ, ఆయన మాత్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓ ఫేక్ మెసేజ్ తన పేరుతో ప్రచారంలోకి వచ్చిందని కూడా తానే ఖండించారు. “అది నాది కాదు” అని తేల్చిచెప్పిన ఆయన, ఇప్పటికీ జగన్ వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఒక వ్యూహం కిందేనని అంటున్నారు పరిశీలకులు. ఆయన ప్రస్తుతం సరిగ్గా సమయం కోసం ఎదురు చూస్తున్నారని, ఆ సమయం వచ్చినపుడు పెద్ద ఎఫెక్ట్ కలిగించేలా ఏదైనా చేయగలరని అంటున్నారు.
వాస్తవానికి, జగన్ రాజకీయ వ్యూహాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై విజయసాయిరెడ్డికి పూర్తిగా అవగాహన ఉంది. అటు సీబీఐ (CBI), ఈడీ (ED) లాంటి దర్యాప్తు సంస్థల కేసుల్లో ఆయన ఎప్పటికైనా అప్రూవర్‌గా మారితే, అది జగన్‌కు పెద్ద దెబ్బ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి నుంచి ఎప్పుడైనా ఒక్క పెద్ద బాంబ్ వచ్చే ఛాన్స్ ఉందన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చర్య ఏంటన్నది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశంగా మారింది.