Uttarakhand: ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. మృతుల్లో ఏపీ ఎంపీ సోదరి

ఉత్తరాఖండ్ (Uttarakhand )లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారు. మరొకరు గాయపడ్డారు. అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ (MP Lakshminarayana) సోదరి వేదవతి (Vedavati) తో పాటు విజయారెడ్డి (Vijaya Reddy ) అనే మహిళ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. వేదవతి భర్త భాస్కర్ గాయాలతో బయటపడ్డారు. దీంతో ఆయనున చికిత్స నిమిత్తం రషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. గురువారం ఉదయం పర్యాటకులతో వెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.