BR Naidu : తిరుమల పవిత్ర క్షేత్రం .. ఇది రాజకీయ వేదిక కాదు : బీఆర్ నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ధర్మకర్తల మండలి తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 2019-24 మధ్య టీటీడీ (TTD) లో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది. మొదటి ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలోకి తెస్తోంది. అవినీతికి తావులేకుండా నిబద్ధతతో పనిచేస్తూ భక్తులకు స్వామి వారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తెలిపారు.