Tirumala: కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఈవో శ్యామల రావు (EO Shyamala Rao) తెలిపారు. సమావేశం అనంతరం ధర్మకర్త మండలి నిర్ణయాలను శ్యామల రావు మీడియాకు వెల్లడిరచారు. కొండపై పచ్చదనం పెంపునకు టీటీడీ చర్యలు మొదలు పెట్టిందన్నారు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు టీటీడీ రూ.4 కోట్లు ఇచ్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు.
ధర్మకర్తల మండలి నిర్ణయాలు:
టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి కమిటీ ఏర్పాటు. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మాచ్చారు. రెండు అతిథిగృహాల పేర్లు మార్చలేదు. వాటిని టీటీడీనే పేర్లు మార్చనుంది. ఆకాశగంగ, పాపవిశానం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ. స్విమ్స్ ఆసుపత్రి (Swims Hospital) లో 579 పోస్టుల భర్తీకి ఆమోదం. ఒంటిమిట్ల ఆలయం (vontimitta temple )లో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయం. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ (Anti-drone technology) వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.