TTD Darshanam: తిరుమలలో ఏఐ..రెండే రెండు గంటల్లో శ్రీవారి దర్శనం..

తిరుమల తిరుపతి (Tirumala) వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara)దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఎందరో భక్తులు ఏటా వస్తూ ఉంటారు. అయితే తిరుమలలో దర్శనం అనేది కొన్నిసార్లు ఎంతో టైం తీసుకుంటుంది. పైగా మనం దర్శనం చేసుకోవాలంటే ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలి. అయితే అన్నిసార్లు అలా కుదరదు కదా.. పైగా గంటల తరబడి లైన్లో నిలబడి దర్శనం చేసుకోవాలి అంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న తల్లుల దగ్గర నుంచి కాస్త పెద్ద వయసు ఉన్న వారి వరకు ఈ సమస్య మనం గమనిస్తుంటాం.
అయితే ఇప్పుడు శ్రీవారి దర్శనం (Tirumala Darshanam) కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు.. భక్తులకు కేవలం రెండు గంటలలోగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం టీటీడీ (TTD) చక చక ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం అధునాతనమైన టెక్నాలజీని కూడా రంగంలోకి దింపుతుంది. దీనికోసం ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు..ఇంతకీ అదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అదిగో దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్AI ) ఆధారంగా రూపొందించిన ఒక ఫేస్ రికగ్నైజేషన్ మిషన్ లేదా కియోస్కి వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడంతోటే మన ఫేస్ క్రీమ్ పై కనిపిస్తుంది.. అలాగే ఆ మిషన్ మనకు దర్శనం స్లిప్పులను కూడా ఇస్తుంది. ఇక స్లిప్పులు తీసుకొని నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పేస్ రికగ్నిషన్ ఎంట్రీ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళిపోవచ్చు.
దీనికి సంబంధించిన పూర్తి డెమోని టీటీడీ చైర్మన్(TTD chairman) బి ఆర్ నాయుడు(B.R.Naidu) , బోర్డు సభ్యులు మరియు ఈవో తో కలిసి తిలకించారు. ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియపరుస్తూ వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ రెండు కంపెనీలు తమ డెమోని సబ్మిట్ చేశాయి.. వీళ్లతో పాటు మరికొన్ని సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయట.. అయితే భక్తులకు అనుకూలమైన విధానాన్ని ఏ కంపెనీ ప్రొవైడ్ చేస్తే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి టీటీడీ ట్రై చేస్తోంది. అని అనుకున్న ప్రకారం జరిగితే ఎలాంటి సమస్య లేకుండా ఈ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.