ponnam prabhakar: తెలంగాణ పిల్లలకు ఏపీలో స్థానికత్వం కల్పించాలి : మంత్రి పొన్నం

రాష్ట్రంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తెలంగాణ (Telangana) పిల్లలకు స్థానికత్వం కల్పించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం, ఏపీ సర్కార్ నిర్ణయంతో సైనిక స్కూల్ ప్రవేశ పరీక్ష రాసిన 20వేల మంది విద్యార్థులు నైరాశ్యంలో ఉన్నట్లు తెలిపారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో సైనిక స్కూళ్లు ఉన్నాయని, తెలంగాణలో తొందరగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy) జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.