Amaravathi: టీడీపీకి కోవర్టుల భయం.. పూర్తి విచారణ జరిపాకే వలసలకు ఆహ్వానం..

ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ టీడీపీ (TDP) లో కూటములు జోరుగా సాగుతున్నాయి. వైసీపీపై నమ్మకం లేక కొందరు, రెడ్ బుక్ భయానికి మరికొందరు.. సైకిలెక్కేస్తున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీకి సంతోషం కలిగిస్తున్నా.. ఇటీవలి కాలంలో కొందరు టీడీపీ కార్యకర్తల హత్యలతో .. వాస్తవం బోదపడింది. అంటే తమ పార్టీలోకి కొందరిని పంపించి… వారితో తమ కార్యకర్తలనే హత్య చేయిస్తున్నారని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే..ఇప్పుడు అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నారు చంద్రబాబు.
ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి.. వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో విడుదలైన ఆ ప్రకటనలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీటీడీలోకి జాయిన్ చేసుకునేముందు తప్పని సరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. వారి గురించి పూర్తి కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత.. పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది.. ఈ విషయాన్ని టీడీపీలోని వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు పల్లా శ్రీనివాసరావు.. ఈ విషయాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకు సూచించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు..
కాగా, మహానాడు సహా ఇతర సమావేశాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ycp) కోవర్టులు ఉన్నారు.. వారితో జాగ్రత్త.. ఇక్కడి విషయాలు అక్కడకి చేరిపోతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ నేతలు, శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు టీడీపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది..