Vizag: విశాఖలో సత్యసాయి సంకీర్తన సతగీతి మాలిక రికార్డింగ్ ప్రారంభం.. వంజరాపు శేషు సాహిత్యాన్ని ఆలపించనున్న గజల్ వినోద్
- బాబా 100వ జయంతి వేడుకలకు అంకురార్పణ
విశాఖపట్నం, డిసెంబర్ 02, 2025: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, రచయిత వంజరాపు శేషు రచించిన పాటలను ప్రముఖ గజల్ గాయకుడు గజల్ వినోద్ 100 బాబా పాటలు పాడి రికార్డింగ్ చేసేందుకు విశాఖపట్నం వేదికైంది. ఈ ప్రతిష్టాత్మక సంకల్పానికి “సత్యసాయి సంకీర్తన సతగీతి మాలిక” అని నామకరణం చేశారు. నవంబర్ 30, 2025న జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది బాబా భక్తులు పాల్గొన్నారు, ఆధ్యాత్మిక భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా బాబా పాటల సీడీ తొలిగీతాన్ని ఐడల్ గంధర్వ శ్రీ శరత్ చంద్ర [MATA] మన అమెరికా తెలుగు సంఘం గౌరవ సలహాదారు కో కన్వీనర్ శ్రీ దాము గేదెల ఆవిష్కరించారు.
ఈ భక్తిపూర్వక కార్యక్రమంలో గజల్ వినోద్ గారితో పాటు, శరత్ చంద్ర గారు, దాము గేదెల గారు, గంటా లక్ష్మీ గారు మరియు ఇతర బాబా భక్తులు మంత్రముగ్ధులను చేసే భజన్స్ను ఆలపించారు.
హాజరైన ప్రముఖులు..
ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ లింగమూర్తి, సీతమ్మధార సత్యసాయి బాబా భజన మండలి సభ్యులు ప్రసాద్, రాంబాబు, త్రినాథ్, రైతు దాము, మీనాక్షి, సుజాత, ధనలక్ష్మి, వకుళాదేవి, సంధ్య, శ్రీలత, రాజేష్, సత్యసాయి సేవా సమితి సభ్యులు రౌతు దాము, నాగమణి, రమణ, కృష్ణ కుమార్, గంట ఈశ్వర్ తదితరులు పాల్గొని ఈ మహా సంకీర్తన యజ్ఞానికి తమ వంతు సహకారాన్ని, భక్తిని అందించారు.






