Rajahmundry: రాజమహేంద్రవరం నుంచి తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం

రాజమహేంద్రవరం (Rajahmundry) నుంచి తిరుపతి (Tirupati) కి విమాన సర్వీసును పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ప్రారంభించారు. ఢల్లీిలోని రాజీవ్‌గాంధీ భవన్ నుంచి ఎంపీ పురందేశ్వరి ( Purandeshwari) తో కలిసి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలయన్స్ ఎయిర్(Alliance Air) విమానయాన సంస్థ ఈ విమాన సర్వీసులను నడపనుంది. దీని ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాసులకు ఆకాశయానం ద్వారా ఆధ్మాత్మిక యాత్ర దగ్గరకానుంది. రెండో తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. మంగళ, గురు, శనివారాల్లో అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థ దీన్ని నడపనుంది.